Pages

Subscribe:

Friday 25 September 2020

శివ! నాకును నాదమునకు సంధానమ్మును గావించు

శివ! నాకును నాదమునకు సంధానమ్మును గావించు

నాదమయమ్మౌ నీదివ్యత్వమునందుకొనగ నను కరుణించు

చెవులారా ఢమరుధ్వానముల చెలువముతో శివ! వినిపించు

నాట్యవేళ నీయడుగుల మువ్వల నాదములను దయ వినిపించు

జడలోపల దుమికాడు గంగమ్మఝరుల గలగలలు వినిపించు

మసలి మురియు నీ భుజగహారముల బుసలను చేరువ వినిపించు

ప్రమథగణపు సంబరపు చిందులను భంభం నాదము వినిపించు

హరిమృదంగ విన్యాస వైఖరుల అద్భుతాలనిక వినిపించు

కలసి నీ జతను ఆడు గౌరమ్మ కంకణ ధ్వనుల వినిపించు

మహర్షి పుంగవులెల్ల నుతి జేయు పంచాక్షరినే వినిపించు

నీ రూపమ్మౌ ప్రణవధ్వనినే మారుమ్రోగగను వినిపించు

కరుణామయ! నినుతాకి వెడలు చిరుగాలి గుసగుసలు వినిపించు

నా దెసకీవే వచ్చుచున్న చరణమ్ముల సవ్వడి వినిపించు

నీ దర్శనమున నా శరీరమున నిండు ప్రకంపన వినిపించు!!