Pages

Subscribe:

Tuesday 24 February 2015

అన్నీ మంచి శకునములే




చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల

గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల  

ప: అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే....

నావలెనే నా బావ కుడా... నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనె బిరాళ నన్ను చేరునులే!!అన్నీ!!

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే!!

మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కలరవములతో.. జీవితమంతా వసంతగానమౌనులే.!!



Sunday 8 February 2015

ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు

   


చిత్రం: కన్నవారి కలలు 
రచన: సినారె
గానం: రామకృష్ణ, సుశీల
సంగీతం: వి కుమార్
ప: ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు

1. ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడు కున్నాయో
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడు కున్నాయో
పొదలో ప్రతి పువ్వు పొంచి పొంచి చూచినది
గూటిలో ప్రతి గువ్వ గుస గుస లాడినది
కలసిన కౌగిలిలో కాలమే ఆగినది !!ఒకనాటి!! 

2. చల్లగ చలచల్లగ చిరు జల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ వూహల్లో విరిసేనా
చల్లగ చలచల్లగ చిరు జల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ వూహల్లో విరిసేనా
కొంటెగా నిన్నేదో కోరాలని వుంది
తనువే నీదైతే దాచే దేముంది
వలపుల వీణియపై బ్రతుకే మ్రోగింది !!ఒకనాటి!!      


 

నిన్నలేని అందమేదో

 
చిత్రం: పూజాఫలం 
రచన: సినారె
గానం: ఘంటసాల
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు

ప: నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో
తెలియని రాగమేదో తీగసాగెనెందుకో తీగసాగెనెందుకో నాలో

పూచిన ప్రతి తరువొక వధువు పువుపువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో!!నిన్నలేని!!

తెలినురుగులె నవ్వులు కాగా సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే!!నిన్నలేని!!
పసిడి అంచు పైటజార పయనించె మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే !!నిన్నలేని!!



కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో



చిత్రం : జెంటిల్‌మెన్ (1993)

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : రాజశ్రీ
గానం : ఎస్.పి. బాలు , ఎస్.జానకి


ప: కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

1. అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే    \\2\\
చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేసానంటే పడి తీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేదీ లేదే

2. కొనచూపుతోనే వేసావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం
కొరగాని వాడితో మనువు మధురం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం చెలరేగే అందం
నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట