Pages

Subscribe:

Monday 18 November 2013

మనసే కోవెలా మమతలు మల్లెలుగా

             

             
చిత్రం : మాతృదేవత
సంగీతం : కె.వి.మహాదేవన్
రచన : దాశరధి
గానం : పి.సుశీల

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..!!మనసే!!

ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం -2
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి - 2
మన కలలన్నీ పండాలి!!మనసే!!

ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగ పొందాను -2
ప్రతి రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేను - 2!!మనసే!!

నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో - 2
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి!!మనసే!!

0 comments:

Post a Comment