చిత్రం : తాతా మనవడు (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : రామకృష్ణ
పల్లవి : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం..
వింతనాటకం అనుబంధం
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం..
వింతనాటకం అనుబంధం
చరణం 1 : ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ
తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ
తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం
ఎవ్వరికీ.. ఎవ్వరికీ
అది కాలుతున్నా వెలుగులె కావాలి
అందరికీ. . అందరికీ!!
చరణం 2 : కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు
గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ -
వల్లకాటికైన వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ
కనగూడదు ఇలాంటి కొడుకునూ
ఇలాంటి కొడుకునూ!!
చరణం 3 : కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికి
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన
వున్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా?!!2సార్లు!!
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం..
వింతనాటకం అనుబంధం
0 comments:
Post a Comment