పల్లవి: ఇది ప్రదోష సమయము సర్వేశ్వర!
నటరాజా!
తరలివచ్చిరమరులు నీ తాండవ శోభను జూడ
చరణం: నాట్యకళా సాకారా! నాదతనూ!
పరమేశ్వర!
చరణమ్ముల కదలికలకు హరిమృదంగ లయలు తోడు
భవ! నీ అభినయ శోభకు పలుకులచెలి పాటతోడు
జతులగతుల సొగసులకును ధాత తాళమే తోడు
.....పల్లవి............
చరణం: నర్తిత గంగాధారీ! తరుణేందు
విభూషణా!
మువ్వలతో పురుహూతుని మురళిమంతనాలు తోడు
అడుగడుగున కలిసియాడ అమ్మనగజ అడుగుతోడు
షణ్ముఖ నుత! నీ పదముల అందెకు నా ఎడద
తోడు ......పల్లవి................
http://picosong.com/Ykw9/
0 comments:
Post a Comment