Pages

Subscribe:

Tuesday 2 April 2019

చేతిలో చెయ్యేసి చెప్పు బావ


చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చరణం 1:
పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని

పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చరణం 2:
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కలకాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి
మన జంట జంటలకే కన్నుకుట్టు కావాలి
ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలై పోవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ

0 comments:

Post a Comment