చిత్రం : అభిమానం
సంగీతం : ఘంటసాల
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, జిక్కి
ప: వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
౧. వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట!!వలపు!!
౨. నిలవాలిలే హమేషా…. ఈనాటి ప్రేమభాషా..
నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా!!వలపు!!
0 comments:
Post a Comment