చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల
టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు
తొలినాటి స్నేహితులారా… చెలరేగే కోరికలారా…
టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు…
టాటా వీడుకోలు…
ప్రియురాలి వలపులకన్నా నునువెచ్ననిదేది లేదని…
నిన్ననే నాకు తెలిసింది… ఒక చిన్నది నాకు తెలిపింది…ఆ… ప్రేమ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ… కామ నగరుకు రాను… ఇక రాను…
టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…
ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్ఛటను లేనే లేదనీ…
లేటుగా తెలుసుకున్నాను… నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ మోహా నగరుకు రాను… ఇక రాను…
టాటా వీడుకూలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…
మధుపాత్ర కెదలొ ఇంక ఏమాత్రం చోటు లేదనీ… -
మనసైన పిల్లె చెప్పింది… -
నా మనసంతా తానై నిండింది
నే… రాగ నగరుకే పోతాను…
అనురాగ నగరుకే పోతాను… పోతాను…
0 comments:
Post a Comment