Pages

Subscribe:

Sunday 1 November 2015

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక


 చిత్రం: శుభలగ్నం
గానం: బాలు
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి

ప: చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక!!


౧. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే!!


౨. అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో
అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా!!



0 comments:

Post a Comment