Pages

Subscribe:

Sunday 20 November 2016

మనసు పలికే... మనసు పలికే

  


చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత:     సినారె
నేపధ్య గానం :  బాలు, జానకి  
పల్లవి : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
మనసు పలికే...  మనసు పలికే
మౌనగీతం...  మౌనగీతం
మనసు పలికే.. మౌన గీతం.. నేడే
మమతలొలికే...  మమతలొలికే
స్వాతిముత్యం...  స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం... నీవే
 అణువు అణువు...  ప్రణయ మధువు
అణువు అణువు... ప్రణయ మధువు
తనువు...  సుమధనువు
మనసు పలికే... మౌన గీతం...  నేడే
మమతలొలికే స్వాతిముత్యం... నీవే
చరణం 1 :శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ... మరుల జలకాలాడనీ
సగము మేన  గిరిజనై పగలు రేయి ఒదగనీ... పగలు రేయి ఒదగనీ
హృదయ మేళనలో...  మధుర లాలనలో
హృదయ మేళనలో...  మధుర లాలనలో
వెలిగిపోని...  రాగ దీపం
వెలిగిపోని రాగ దీపం...  వేయి జన్మలుగా.... 
చరణం 2 : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ... ఓనమాలు దిద్దనీ
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ... మొదటి తీపి ..
లలిత యామినిలో...  కలల కౌముదిలో
లలిత యామినిలో...  కలల కౌముదిలో
కరిగిపోని కాలమంతా...
కరిగిపోని కాలమంతా...  కౌగిలింతలుగా!!



0 comments:

Post a Comment