Pages

Subscribe:

Tuesday 15 November 2016

కనుపాప కరవైన కనులెందుకో



చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: పి.లీల, ఘంటసాల 
పల్లవి : కనుపాప కరవైన కనులెందుకో
తనవారె పరులైన బ్రతుకెందుకో    
కనుపాప కరవైన కనులెందుకో
తనవారె పరులైన బ్రతుకెందుకో     
చరణం 1 : విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే
విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే
మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే!!
చరణం 2 : అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా
అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా
తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా!!
చరణం 3 : తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే
తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే
ఏనాటికైనాను నీదాననే...  నీదాననే
చిననాటి మన పాట మిగిలేనులే
కలకాల మీ గాథ రగిలేనులే... రగిలేనులే


0 comments:

Post a Comment