Pages

Subscribe:

Monday 20 April 2020

మలపు మలపులలోన మలసి నా తోడున్న


మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర! నాదు మన్నీడవు నా నీడవు నా జాడవు
సూటిగా సాగు బహు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు
ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు!!
అడుగులకె సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్నరయు దొరవు
నడకనిడుముల బెట్టు అడుసుత్రోవలలోన గడుసుగా బ్రోచు నా కనురెప్పవు!!
జలములో స్థలములో పలు పథమ్ములలోన నిలచి కాపాడు మా నిఖిలాత్మవు
త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవె త్రోవలు మలచి నెనరుంతువు!!
బ్రతుకుతెరువులలో, భావాల తెరువులలో, ఆలోచన తెరువులలో, నడిచే త్రోవలలో కూడా భగవానుడు మార్గసహాయేశ్వరుడై ఎలా రక్షిస్తాడో చెప్తున్నటువంటి గీతం ఇది.

0 comments:

Post a Comment