Pages

Subscribe:

Sunday 16 February 2014

నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా

              
చిత్రం: భబ్రువాహన
సంగీతం: పామర్తి
రచన: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, సుశీల


ప: నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా
నినువిడి నిలువగ లేను సుమా
 నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా
నను విడుమా....ఇక నను విడుమా
నమస్తే జటాధారి....నాదారిని
విడు విడుమా....చెలి నిలు నిలుమా..

౧.  మగువలు కొలువగ దరిచేరగా
మతిమాయుట యతులకు న్యాయమా
నీ కనుసన్నలా నను కరుణించినా
ఈ సన్యాసి మారేను సంసారిగా
విడువిడుమా.....చెలి నిలు నిలుమా!!

౨. తాకకుమా నే పపినయ్యా...
ఈ రూపము నిలువగ రానిదయా
నీ రూపానికే నే ఈ రూపున
ఇట చేరి జపించి తపించేనులే
విడు విడుమా.......చెలి నిలు నిలుమా!!

౩. విజయునికే తనువంకితం
నీ చెలువుని మోసం చేయుదువా
నేనే విజయుండను నేనే చెలికాడను
ఈ గోశాయి వేసాలు నీకోసమే
హా....ఆ....
నిలు నిలుమా....నను విడు విడుమా!!


0 comments:

Post a Comment