పాడినవారు: బ్రహ్మశ్రీ బాలక్రిష్ణ ప్రసాద్ గారు
శివా అనినంతనే చెమరించు కనుదోయి
పులకరించెడి ఒడలు పొంగిపోయెడి ఎడద
చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము
ఇది ఒక్కటీయుమా ఇతరములు కోరను!!
పులకరించెడి ఒడలు పొంగిపోయెడి ఎడద
చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము
ఇది ఒక్కటీయుమా ఇతరములు కోరను!!
౧. అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి
హరహరా! శివ శివా! అని అరచి మైమరచి
నీ చేతి డమరుకమ్మురీతిగా ఊగాడి
నీ కాలి మువ్వ వలె నిరతమ్ము చిందాడి
పరవశించెడి దివ్య భాగ్యమును ఇప్పింపుమా
పరమంపు ఆ భక్తి వరమీయుమయ్యా !!
హరహరా! శివ శివా! అని అరచి మైమరచి
నీ చేతి డమరుకమ్మురీతిగా ఊగాడి
నీ కాలి మువ్వ వలె నిరతమ్ము చిందాడి
పరవశించెడి దివ్య భాగ్యమును ఇప్పింపుమా
పరమంపు ఆ భక్తి వరమీయుమయ్యా !!
౨. మనసు కైలాసము మనికి కైవల్యమ్ము
తలపులన్నియు ప్రమథతండమ్ములై మారి
నీ తాండవంపు శోభ నిండుగా దరిసించి
నిలువెల్ల ఆనంద నిధులుగా పులకించి
మురిసిపోయెడి కలిమి కురిపించుమయ్యా
ముదిత షణ్ముఖ నుతా! సదయ ధీరోన్నతా!!
తలపులన్నియు ప్రమథతండమ్ములై మారి
నీ తాండవంపు శోభ నిండుగా దరిసించి
నిలువెల్ల ఆనంద నిధులుగా పులకించి
మురిసిపోయెడి కలిమి కురిపించుమయ్యా
ముదిత షణ్ముఖ నుతా! సదయ ధీరోన్నతా!!
http://picosong.com/YTxS
0 comments:
Post a Comment