Pages

Subscribe:

Friday 21 February 2014

అడిగిన కాదనలేనిది అమ్మా నీ కరుణ



 పల్లవి: అడిగిన కాదనలేనిది అమ్మా నీ కరుణ,
విశాలాక్షి అన్నపూర్ణ విశ్వేశ్వర లలనా...
చరణం1: ఆదిభిక్షకుని పాత్రకు ఆదిభుక్తినందించిన ఆదిమ గృహిణీ జగతినాదరించు తల్లీ..
శివార్పణమ్మైన సిరులు సిద్ధమైన ప్రసాదములు వడ్డించుమ జననీ మా జీవన పాత్రలలో!!అడిగిన!!
2.  నీవిచ్చిన ఈ బిచ్చమె ఙ్ఞాన వైరాగ్యములిడు ఆ ఫలమే కైవల్యము.. అమ్మా! అది నీ పదము.
కన్న శిశువు ఆకలి కనుగొన్న తల్లి నీవే
 ఆగని మా ఏడుపులను ఆపి ఏలుకోవే!!అడిగిన!!
http://picosong.com/qGuM

0 comments:

Post a Comment