Pages

Subscribe:

Monday 21 July 2014

తెల్లమబ్బు తేరుమీద ఇలకు దిగిన వెండి చందమామా

            

            


చిన్నోడు పెద్దోడు చిత్రం కోసం ఒక బాణీని సిద్ధం చేసి వినిపించారట బాలూ గారు. బాణీ విన్న నిర్మాత శివలంక ప్రసాద్ గారు కాస్త క్లాస్ అయిపోతుందేమో అని భయపడ్డారట. అయితే దర్శకులు రేలంగి నరసింహారావు గారు ఓకె అనడంతో పాట వ్రాయడానికి వెన్నెలకంటి గారిని పిలిపించారట. బాలుగారి వరస మీద మనసైన వెన్నెలకంటి గారు వెంటనే ఒకటి కాదు ఆరు పల్లవులు వ్రాసేశారట. వాటిలో అందరికీ నచ్చిన పల్లవి “తెల్లమబ్బు తేరుమీద ఇలకు దిగిన చందమామ” అన్న పల్లవి. వెన్నెల లాంటి భావంతో వెన్నెలకంటి నాకిచ్చిన కానుక ఇది అని బాలూ గారు ఇప్పటికీ చెప్పుకునే పల్లవి వరుసకు అద్భుతమైన ఆలాపనను జోడించి ఆ పాటకు పరిమళాలను అద్దింది మరెవరో కాదు అప్పటి బాలూ గారి అసిస్టెంట్, ఇప్పటి సంగీత దర్శకులు శ్రీనివాసమూర్తి గారు.
గానం: బాలు, జానకి

ప: తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా నువ్వే నా ప్రేమా
రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా ఒకటై ఒదిగేమా

౧. యుగాలు వేచినా నిరీక్షలోనా
ఎడారి గుండెలో వరాల వానా
పదాలకందనీ యతంట నువ్వు
పదాల వాలినా సుమాన్ని నేను
వయసే తపించీ వలపే జపించీ
కలలే ఫలించీ కలిపే విరించీ
కుందనాల బొమ్మ కనువిందు చేసెనమ్మా
కోరివచ్చె కొమ్మ దరిజేరి ఏలుకోమ్మా
ఆరు  ఋతువులేకమైన ఆమని మనదే సుమా!!రెక్క!!

౨. గులాబి సిగ్గులా నివాళులీనా
వరించి నిన్ను నే తరించిపోనా
విరాళి సైపనీ వియోగ వీణ
సరాగమైనదీ స్వరాలలోన
చూపుల మందారం పాపట సింధూరం
కులుకే సింగారం పలుకే బంగారం
చిరునవ్వుల సారం చిగురించిన సంసారం
 చెలిసొగసుల గారం చెలరేగిన శృంగారం
కలసిన హృదయాలలోన వెలసిన రస మందిరం!!తెల్ల!!




0 comments:

Post a Comment