Pages

Subscribe:

Tuesday 11 November 2014

ప్రతి రాత్రి వసంత రాత్రి

    
చిత్రం: ఏకవీర
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం: ఎస్ పి బాలు, ఘంటసాల
సంగీతం: కెవి మహదేవన్

ప్రతి రాత్రి వసంత రాత్రి
ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి !!ప్రతి రాత్రి!!

౧. నీలో నా పాట కదలీ
నాలో నీ అందె మెదలీ
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసీ
మనకోసం ప్రతి నిముషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి!! ప్రతిరాత్రి!!

౨. ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
ననుజూచీ, నినుజూచీ వనమంతా వలచింది
ననుజూచీ ప్రియా, ప్రియా వనమంతా వలచింది!!ప్రతిరాత్రి!!

0 comments:

Post a Comment