Pages

Subscribe:

Tuesday 11 November 2014

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే


చిత్రం: ప్రేమికుడు 
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
గానం: ఉన్ని కృష్ణన్ 
సాహిత్యం: రాజశ్రీ

చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

౧. ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఊన్నదిలే!!

౨. కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మేటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే!!


0 comments:

Post a Comment