Pages

Subscribe:

Wednesday 25 March 2020

శ్రీవైద్యనాథాయ శివాయ నమః

ఎంతో వేడుకగా ఉగాది జరుపుకోవాల్సిన ఈ తరుణంలో యావత్ ప్రపంచం కరోనా వైరస్ వల్ల భయభ్రాంతులకు లోనై ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఈ సందర్భంలో ప్రజలందరి ఆరోగ్యసిద్ధి కోసం వైద్యనాథుడు, మృత్యుంజయుడు అయిన శివుని గురించి ఒక కీర్తన రచించి ఇవ్వమని మహానుభావులైన సామవేదం షణ్ముఖ శర్మగారిని ప్రార్థించగా వారు ఆ ప్రార్థనను మన్నించి రచించినది. 

శ్రీవైద్యనాథాయ శివాయ నమః ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
శ్రీవైద్యనాథాయ శివాయ నమః దేవాంతరంగాయ దివ్యలింగాయ
శ్రీవైద్యనాథాయ శివాయ నమః దేవాంతరంగాయ దివ్యలింగాయ
నమః నమః నమః
బాలాంబికేశాయ భవరోగ భిషజే కాలాగ్నయే మహాకాలాయ రుద్రాయ 2సార్లు
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
నీలగ్రీవాయ నిటలేక్షణాయ నీలగ్రీవాయ నిటలేక్షణాయ
బాలేందుచూడాయ భయాపహాయ 2సార్లు
శ్రీవైద్యనాథాయ శివాయ నమః నమః నమః నమః
అమృతాప్లుతాంగాయ అమృతేశ్వరాయ శమన మదశమనాయ శాంతాయ సాంబాయ 2సార్లు
అమరగణవినుతాయ ఆదివైద్యాయ 2సార్లు
శమదమాన్విత శిష్టజనసేవితాయ 2సార్లు
శ్రీవైద్యనాథాయ శివాయ నమః నమః నమః నమః
నిత్యాయ శుద్ధాయ మృత్యుంజయాయ శృత్యంతవేద్యాయ సుఖ విగ్రహాయ
నిత్యాయ శుద్ధాయ మృత్యుంజయాయ శృత్యంతవేద్యాయ శుభ విగ్రహాయ
నృత్యత్పదార్చాయ నిజభక్తపాలాయ 2సార్లు
సత్యాయ షణ్ముఖ సంభావితాయ 2సార్లు
శ్రీవైద్యనాథాయ శివాయ నమః దేవాంతరంగాయ దివ్యలింగాయ


0 comments:

Post a Comment