Pages

Subscribe:

Thursday 1 January 2015

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా

               
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : సముద్రాల (సీనియర్ )
గానం : పి.సుశీల

ప: జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా
బ్రోచే భారము నీదే కదా!
నా భారము నీదే కదా!

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!

నిన్నేగానీ పరులనెఱుంగా
రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా! జీవము!!

హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా.. కమలలోచనా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగ రావే
కన్నుల విందువు చేయగ రావే
ఆశ్రిత భవ బంధ నిర్మూలనా
ఆశ్రిత భవ బంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా ....  లక్ష్మీ వల్లభా!

నిన్నే నమ్మి నీ పాదయుగళి సన్నుతి చేసే భక్తావళికి
మిన్నాగుల గన భయమది యేలా
పన్నగశయనా నారాయణా!!జీవము!!

మదిలో వెలిలో చీకటి మాపి
మదిలో వెలిలో చీకటి మాపి
పథము చూపే పతితపావనా
పథము చూపే పతితపావనా!!జీవము!!

భవజలధిని బడి తేలగలేని
భవజలధిని బడి తేలగలేని
జీవుల బ్రోచే పరమపురుషా
నను కాపాడి నీ బిరుదమును
నను కాపాడి నీ బిరుదమును
నిలుపుకొంటివా శ్రితమందారా!!జీవము!!

0 comments:

Post a Comment