Pages

Subscribe:

Wednesday 28 January 2015

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా.

 
చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  సుశీల  

ప: ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా 

1. రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
అది తీపి కోపాల వయసూ..
ఆ ఆ ఆ....
కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
అది మాయ మర్మాల మనసూ
అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
పదహారువేల సవతులు వద్దు
ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు!! ఆపొన్న!!

2. ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
ఆ..ఆ..ఆ..
ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
వేసవి సోకు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
వేసవి సోకు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు

కలహాలు పెంచే కౌగిలి ముద్దు
ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు!!






1 comments:

Unknown said...

Super mam...thank you for nice post

Post a Comment