Pages

Subscribe:

Thursday 29 January 2015

కొమ్మ కొమ్మకో సన్నాయి



చిత్రం: గోరింటాకు
గానం: సుశీల, బాలు
రచన: వేటూరి
సంగీతం: మహదేవన్

ప: కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటి మౌనం?
ఎందుకీ ధ్యానం?
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం
మాటలో మౌనం

1. మనసు మాటకందని నాడు..మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే.. పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం.. పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో..ముసురుకున్న మబ్బులు చూడు.!!

2. కొంటె వయసు కోరికలాగా..గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో, నీటితోనో.. పడవ ముడి పడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి!!



0 comments:

Post a Comment