Pages

Subscribe:

Wednesday 28 January 2015

అబ్బనీ తియ్యనీ దెబ్బ



చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి
రచయిత: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్ పి బాలు, చిత్ర
ప: అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తీయనీ దెబ్బ
ఎంత కమగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా ||అబ్బనీ||
1. చిటపట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసికసి వయసులో
ఒక ఎదనస పదనిస కలవుగా
కాదంటూనే కలబడు
అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు
తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట ||అబ్బనీ||
2. అడగక అడిగినదేవిటో
లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు
అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు
అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా
మనకు ముదిరెను ముచ్చట!!అబ్బనీ!!



0 comments:

Post a Comment