Pages

Subscribe:

Sunday 8 February 2015

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి

            
 చిత్రం: ముత్యాల ముగ్గు
సంగీతం: కె వి మహదేవన్
రచన: సినారె
నేపధ్యగానం: బాలు, సుశీల

ప: గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మడి
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మడి
పొద్దు కాదది నీ ముద్దు మోమున
దిద్దిన తిలకమే సుమా                  
వెలుగులు కావవి నీ పాదాలకు
అలదిన పారాణి జిలుగులే సుమా

1. ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి
ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి
ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాన
పూచిన రంగవల్లులే సుమా!!

2. మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చ గుమ్మడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చ గుమ్మడి
మల్లెలు కావవి మా మహాలక్ష్మి
విరజల్లిన సిరినవ్వులే సుమా
వెన్నెల కాదది వేళ తెలిసి ఆ జాబిలి వేసిన పానుపే సుమా !!

0 comments:

Post a Comment