Pages

Subscribe:

Sunday 8 February 2015

ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే



చిత్రం : నేనంటే నేనే (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ప: ఓ చిన్నదానా
ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..పిల్లా..
మనసువిప్పి మాటాడూ..బుల్లీ..
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

1. నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
ఓహోహో....  ఓహోహో
నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
నిలవకుండ పరుగుతీస్తే నీవే చింత పడతావే హెహే...!!అహ!!
2. బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
రంగు చీరలిస్తానే...ఏఏఏ....
రంగు చీరలిస్తానే ...రవ్వల కమ్మలేస్తానే..
దాగుడుమూతలు వదిలి కౌగిలి యిమ్మంటానే పిల్లా!!అహ!!
3. నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా.. ఒహోహో ఆహాహా
నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా..
కారులోన ఎక్కిస్తా.. పోయ్..పోయ్..
జోరు జోరుగ నడిపేస్తా..
కారులోన ఎక్కిస్తా.. జోరు జోరుగ నడిపేస్తా..
చెంప చెంప రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా..
పిప్పిరి పిప్పిరి పిపిపి
పిప్పిరి పిప్పిరి పిపిపి!!



0 comments:

Post a Comment