Pages

Subscribe:

Sunday 8 February 2015

నీలాల నింగిలో మేఘాల తేరులో



ప: నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

1. ఆ నింగికి నీలం నీవై
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో
రేపూ మాపుల సంధ్యెలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగా చల్లగా ముద్దుగ మెత్తగ హత్తుకుపోయి
నిలువెల్లా....||నీలాల||

2. ఆ హిమగిరి శిఖరం నీవై
నీ మమతల మంచును నేనై
ఆశలు కాసే వేసవిలో
తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
ఉరకలా పరుగులా
పరువంలోనా ప్రణయంలోనా
నిలువెల్లా...||నీలాలా||



0 comments:

Post a Comment