Pages

Subscribe:

Tuesday 13 October 2015

బాలా త్రిపుర సుందరీ - వందేశ్రీమాతరం


బాలాత్రిపురసుందరీ! లీలామయీ! చిద్భావమంజరీ!
ఫాలలోచనీ! శంభుమనోహరీ! పాలించుమా నను ఓ భువనేశ్వరీ!
చరణం:
భువనభవనముల రవిచంద్రులనే దివ్వెలు వెలిగించే తొలితల్లీ!
గ్రహముల రంగులరాట్నముత్రిప్పుచు ఆటలాడు హేలాలీలాకరీ!
చరాచరమ్ముల వరాలకృపతో లాలించే లలితా! శివవనితా!
పంచభూతమయప్రపంచనాయకి పరాశక్తి ఓ ధరాధరసుతా!

 

0 comments:

Post a Comment