Pages

Subscribe:

Sunday 25 October 2015

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని


 చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల
గానం : స్మిత

ఎవరైనా చూసుంటారా
నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీ వేళ చుక్కల్ని తాకేంతలా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని


0 comments:

Post a Comment