Pages

Subscribe:

Sunday 18 October 2015

కల కానిది విలువైనది

       
ప. కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా


౧. అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో!!


౨. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
ఏదీ తనంతతానై నీదరికి రాదూ శోదించి సాధించాలి అదియే ధీరగుణం!!!


0 comments:

Post a Comment