Pages

Subscribe:

Thursday 15 October 2015

పెద్దముత్తైదువా అమ్మా పేరంటానికి రావమ్మా




విజయదశమి శుభాకాంక్షలతో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు పెద్దముత్తైదువుని దర్శించి దర్శింపజేయించిన ధ్యానయోగ్యమైన కీర్తన...."శ్రీ మాతా లలితా" ఆల్బం నుండి. పెద్దముత్తైదువా అమ్మా పేరంటానికి రావమ్మా
విశ్వ కుటుంబిని శివైశ్వర్యమా భక్తి వాయనము గొనుమమ్మా
పాపిట వెలిగే సింధూరమునకు ప్రణామములమ్మా
పసిడి నొసటి పై మిసిమి కుంకుమకు కుసుమాంజలులమ్మా
కలువ కనుల కాటుక రేఖలకే చెలువపు సన్నుతులమ్మా
నాసిక చేరికచే మెరిసే నీ ముక్కెరకు మ్రొక్కులమ్మా
పెద్దముత్తైదువా అమ్మా పేరంటానికి రావమ్మా
విశ్వ కుటుంబిని శివైశ్వర్యమా భక్తి వాయనము గొనుమమ్మా
రవిశశిమండల సదృశములౌ నీ శ్రవణ భూషలకు నతులమ్మా
గళశంఖమ్మున శంభుడు కట్టిన సూత్రమనకు నుతులమ్మా
కరములనమరిన కంకణాదుల కలిమికిని జోతలమ్మా
మాణిక్యాంచిత స్వర్ణ మేఖలకు మనసా వందనమమ్మా
పెద్దముత్తైదువా అమ్మా పేరంటానికి రావమ్మా
విశ్వ కుటుంబిని శివైశ్వర్యమా భక్తి వాయనము గొనుమమ్మా
తొలి తొలి పలుకులు ఘల్లుఘల్లుమను జిలుగుటందెలకు స్తుతులమ్మా
పదముల సొగసున ప్రకాశించు పారాణికి ప్రణతులమ్మా
కమలచరణ నీ కాలిమట్టెలకు శిరసా నమస్సులమ్మా
మృత్యుంజయ ప్రాణేశ్వరి గౌరి దండములోయమ్మా
పెద్దముత్తైదువా అమ్మా పేరంటానికి రావమ్మా
విశ్వ కుటుంబిని శివైశ్వర్యమా భక్తి వాయనము గొనుమమ్మా

http://picosong.com/9GVR


0 comments:

Post a Comment