Pages

Subscribe:

Tuesday 13 October 2015

శ్రీమాతా! లలితా! శ్రితచింతామణీ!

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `శ్రీమాతా లలితా' ఆల్బంలో పాట:
http://picosong.com/SUdx
పల్లవి:
శ్రీమాతా! లలితా! శ్రితచింతామణీ!
చింతింతును తల్లీ! గతి నీవని
చరణం:
చిత్తమె శ్రీపీఠమమ్మా కొలువుచేయుమా
అమ్మా! నా భావన కోటికుంకుమార్చనా
హిమాలయుని ఇంటిసిరిగపుట్టి
ఈశ్వరునొక ఇంటివాని చేసి 
స్వామిమేనిలో సగమై దీపించి
వెనకయ్యను కొమరయ్యను లాలించే జననీ!
చరణం:
నా తనువున చైతన్యము నీవే
నిదురకు మెళకువకు సాక్షి నీవే
మేరుశిఖరిపై వెలిగే శివశక్తి
సుధాస్యందిని! నాదకుండళిని! జననీ! జననీ!

0 comments:

Post a Comment