Pages

Subscribe:

Sunday 24 December 2017

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా


నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా.. స్నేహమా
రెక్కలు తొడిగిన తలపునువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పునువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చేలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథా
వెతికే మనసుకు మమతే పంచుమా ….
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతిమదికి భాదే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరు నవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా ….
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చలగాతమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
చిత్రం : సంతోషం
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం : ఉష

ఉప్పొంగెలే గోదావరి


షడ్యమాం భవతి వేదం..
పంచమాం భవతి నాదం..
శృతి శిఖరే..నిగమజనే.. స్వరలహరీ..
సాస పాపపప పమరిస సనిస
సాస పాపపప పమదప ప
సాస పాపపప పమరిస సనిస
సాస పాపపప పమదప ప
పల్లవి: ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి..
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి..
శబరి కలిసిన గోదారీ రామ చరితకే పూదారి
వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
చుక్కానే చూపుగా..బ్రతుకుతెరువు ఎదురీతేగా!!
1: సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం..
వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం..
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం..
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..
నది ఊరేగింపులో..
పడవమీద రాగా..ప్రభువు తాను కాగా..
2: గోదారమ్మ కుంకంబొట్టు
దిద్దె మిరప ఎరుపు..
లంకానాధుడింటా
ఆగనంటు పండు కొరుకు..
చూసే చూపు ఏం చెప్పింది
సీతా కాంతకీ..సందేహాల మబ్బే పట్టె
చూసే కంటికీ..లోకం కాని లోకం లోన
ఏకాంతాల వలపు..అల పాపికొండలా..
నలుపు కడగలేక..నవ్వు తనకు రాగా!!
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి..
శబరి కలిసిన గోదారీ
రామ చరితకే పూదారి
వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
చుక్కానే చూపుగా..

బ్రతుకుతెరువు ఎదురీతేగా..
చిత్రం: గోదావరి 
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 
రచన: వేటూరి సుందరరామమూర్తి గారు 
సంగీతం: కె. ఎం. రాధాకృష్ణన్ 

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం


 ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
అభిమానం...అనురాగం...చాటేదీ....
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
చిత్రం : ఆ నలుగురు
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : చైతన్య ప్రసాద్
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం