Pages

Subscribe:

Thursday 24 April 2014

వలపువలె తీయగా వచ్చినావు నిండుగా

    
వలపువలె తీయగా వచ్చినావు నిండుగా ||2||
మెరుపువలె తళుకుమని మెరసిపోయేటందుకా ||వలపువలె||

తడబడు నడకల నడిచినపుడు నీ తత్తరపాటును చూడాలి
తలుపు మూయగనె దారులు వెదకె బిత్తర చూపులు చూడాలి ||2||
అని తలచి తలచి ఈ తరుణంకోసం తపసు చేసినది ఇందులకా ||వలపు వలె||

మురిపము లొలికే ముద్దుమోమును కురులమబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరుచెమటలలో కరగుటకా ||2||
ఎదను తెరచి నీవిన్నినాళ్ళుగా ఎదురు చూచినది ఇందులకా ||వలపువలె||

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిడీ

   
సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా ||సిగలోకి||

పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా ||సిగలోకి||

తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం ||సిగలోకి||

ఏవేవో చిలిపి తపులురుకుతున్నవి

 
ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నవి ||ఏవేవో ||

కురులలోన మల్లెపూలు కులుకుతున్నవి
అరవిరిసిన పడుచుదనం పిలుచుచున్నది
మరపురాని తొలిరేయి మరల రానిది ||2||
మగువ జీవితాన ఇదే మధురమైనది ||ఏవేవో||

ఒక్కక్షణం, ఒక్క క్షణం మీరిపోతే దక్కదన్నది
కాలానికి బిగికౌగిలి కళ్ళెమన్నది
కన్నె మనసు ఏవేవో కలలు కన్నది ||2||
ఆ కలల రూపు ఈ రేయే కాంచనున్నది ||ఏవేవో||

తీయనైన తలుపులేవో ముసురుతున్నవి
తీసి ఉన్న తలుపులను మూయమన్నవి
మనసుతోటి తనువు కూడ నీదికానున్నది ||2||
మనుగడ ఈనాటితో మనది కానున్నది ||ఏవేవో||

Wednesday 9 April 2014

మొరటోడు నామొగుడు



మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా

1. తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా
నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ
డడడడ డడడడ డడడడడా

2. నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు
విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా

3. తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ
దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా

Tuesday 8 April 2014

నిగమ నిగమాంతవర్ణిత


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ
నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపైపైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ

నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ
గమగ మదని ధనిస మగసనిధమగస
వివిధ నిర్భంధములవివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను
భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
దివిజేంధ్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
నవనీతచోర స్రి నారాయణ
నిగమ సగమగసనిధమగనినిగమ గసమగధమనిధస
నిగమ

అలిగిన వేళనె చూడాలి

   
ప: అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

౧. అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన (2)
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ... (2) అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

౨. మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా (2)
దృష్టి తగులునని జడిసి యశోద (2) తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి

దినకరా శుభకరా దేవా

    
దినకరా శుభకరా దేవా
దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా

పతిత పావనా మంగళదాతా
పాప సంతాప లోకహితా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
వివిధ వేద విజ్ఞాన నిధాన
వినతలోక పరిపాలక భాస్కర ||| దినకరా శుభకరా |||

ఏడుకొండల స్వామీ ఎక్కడున్నావయ్యా

        
ఏడుకొండల స్వామీ ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా

౧. ఆకాశమందు ఈ కొండ శిఖరమ్ముపై!!2!!
మనుషులుకూ దూరంగా మసలుతున్నావా!!2!!ఏడుకొండల!!

౨. ఎచ్చోట గాంచినా నీవుందువందురు
ఏమిటో నీమాయ తెలియకున్నామయ్యా
ఈ అడవిదారిలో చేయూతనీయవా
నీపాదసన్నిధికి మము జేరనీయవా!!

హే కృష్ణా ముకుందా మురారీ

    
హే కృష్ణా ముకుందా మురారీ
జయకృష్ణా ముకుందా మురారీ
జయగోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి

దేవకి పంట, వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంట ||| కృష్ణా ముకుందా |||

నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట
ఊపునబోయి మాకుల గూలిచి
శాపాలు బాపితివంట ||| కృష్ణా ముకుందా |||

అమ్మా! తమ్ముడు మన్నుతినేను,
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద,
ఏదన్నా నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోట బాపురే
పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్ ||| జయకృష్ణా ముకుందా |||

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోప కిశోరా
కంసాది దానవ గర్వాపహార
హింసావిదూరా పాప విదారా

కస్తూరీ తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం,
కరే కంకణం, సర్వాంగే హరి చందనంచ కలయం,
కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీ || విజయతే ||

లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ, పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలి, శిఖిపించ మౌళీ || కృష్ణా ముకుందా |||

రాముని అవతారం రవికుల సోముని అవతారం

             

ద్వారపాలుర మరల దరిచేయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం రవికుల సోముని అవతారం

రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజనజనావన ధర్మాకారం దుర్జన హృదయవిచారం రాముని అవతారం

౧. దాశరధిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు లక్ష్మణ, శత్రుఙ్ఞ భరతా ||రాముని||

౨. చదువులు నేరుచు మిషచేతా చాపము దాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపం ఒసగును సుందర రూపం ||రాముని అవతార||

౩. ధనువో జనకుని మనసున భయమో ధారుణికన్యా సంశయమో
దనుజులు కలరను సుఖగోపురమో విరిగెను మిధిలా నగరమునా ||రాముని అవతారం ||

౪. కపటనాటకుని పట్టాభిషేకం - కలుగు తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం - లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరిక తీరుచుకోసం పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం - గురుజన సేవకు ఆదేశం ||రాముని అవతారం ||

౫. అదిగో చూడుము బంగరు జింకా - మన్నై చను నయ్యో లంకా
పరనయనాఙ్ఞి పరాంగన వంకా అరిగిన మరణమె నీకింకా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువనమిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం
రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులసోమా
 
సీతాశోకవినాశనకారి లంకా వైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబగునిక నీ చరితా
తమయును పరసతి పై మమకారం వెలయును ధర్మ విచారం !!


సీతారాముల కళ్యాణం చూసిన వారిదె వైభోగం

  
సీతారాముల కళ్యాణం చూసిన వారిదె వైభోగం
కళ్యాణ రాముని రూపం కాంచిన వారిదె కైవల్యం
ఆదిలక్ష్మియే సీతమ్మ ఆది పురుషుడే రామయ్య
ఆది దంపతుల అభినవ పరిణయమమోఘమూ అనుపమమూ!!


౧. ఎర్రన్ని దోసిట తెల్లన్ని ముత్యాలు
సీత తలబ్రాలకై తీసిందీ
తీసిన ముత్యాలు దోసిలి రంగుతొ
ఇంపుగ కెంపులై తోచాయి.
కెంపులనుకున్నవి రామయ్యమైకాన
శోకవనీలమ్ములైనాయి
ఇన్ని రంగులు చూసి ఇంతి తెలబోయింది
ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు

సీతారాముల కళ్యాణము చూతము రారండి

 
ప: సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చూచువారలకు చూడముచ్చటట
పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట ||2||
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట... ||2||
సురలును మునులును చూడవచ్చునట
కళ్యాణము చూతము రారండి ||శ్రీ సీతారాముల||

౧. సిరి కళ్యాణపు బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి
పెళ్లి కూతురై వెలిసిన సీతా ||కళ్యాణము||

౨. సంపంగి నూనెను కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కను బెట్టి ||2||
పెండ్లికొడుకై వెలసిన రాముని ||కళ్యాణము||

౩. జానకి దోసిట కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ||2||
శిరముల మెరిసిన సీతారాముల ||కళ్యాణము||