Pages

Subscribe:

Tuesday 24 June 2014

లాలి లాలి మా బాల శివునకు

                       
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన "శివజ్యోతి" ఆల్బంలోని పాట.

పాడినవారు: బ్రహ్మశ్రీ బాలక్రిష్ణ ప్రసాదు గారు

 పల్లవి: లాలి లాలి మా బాల శివునకు
 లీలా శిశువీ హేలామూర్తికీ..
 లీలా శిశువీ హేలామూర్తికీ..లాలీ...లాలీ..
చరణం: బుసలు మాని కదలికలు మాని ఓ చిలువలార! మచ్చికను ఒదగరే
 జడల పరుగులిడు వడుల గంగమ్మ సడిని మానుమా సామి నిదరోయె...... పల్లవి...
 చరణం: చెలువంపు నుదుట సెగ కను మూసెను; ఇన శశి నయనములివియు మూసుకొని..
 సిగపై వెలిగెను చిఋత వెన్నెలలు నగవులతో నిదరోయె మా సామీ ......పల్లవి...
 చరణం: ఐదు కృత్యముల ఆటలలోపడి అలసిన మా దొర సేద దీరెను..
 నిదురయొ తాపస నిష్ఠయొ ఏమొ...తనలో తననే కనుగొను లీలయో..... పల్లవి...

2 comments:

Unknown said...

🙏🙏🙏💐

Unknown said...

Adbhutha varnana
Gurubyonamaha

Post a Comment