చిత్రం: అమరజీవి
రచన: వేటూరి
గానం: బాలు
సంగీతం: చక్రవర్తి
ప: మల్లెపూల మారాణికి బంతిపూల
పారాణి
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ!!
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ!!
1: పొగడపూలైనా పొగడే అందాలే మెరిసే మలిసంధ్య వేళలో
మల్లీమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా.... ఆలాపనే
నీ.... ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!
మల్లీమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా.... ఆలాపనే
నీ.... ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!
2: రెల్లుచేలల్లో రేయివేళల్లో
కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో
నీ.... సౌభాగ్యమే
నా.... సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!
పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో
నీ.... సౌభాగ్యమే
నా.... సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!
0 comments:
Post a Comment