Pages

Subscribe:

Sunday 15 December 2013

రావోయి బంగారి మామా

      
రావోయి బంగారి మామా
నీతోటి రాహస్యమొకటున్నదోయీ

నీళ్ళ తూరల వెన్క
నిలుచున్న పాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది!!రావోయి!!

అవిసె పువ్వులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమిపోదువుగాని!!రావోయి!!

ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మనసొదల్
కలబోసుకుందాము!!రావోయి!!

పంటకాలువ ప్రక్క
జంటగా నిలుచుంటె
నీడల్లో మన యీడు
జోడు తెలిసొస్తాది!!రావోయి!!

ఈవెన్నెల సొలపు
ఈతెమ్మెరల వలపు
రాత్రి మన సుఖకేళి
రంగరించాలోయి!!రావోయి!!

ఈనాటి మనవూసు
లేనాటికీ మనకు
ఎంతదూరానున్న
వంతెనల్ కట్టాలి!!రావోయి!!

జొన్నచేలో గుబురు
జొంపాలలో గూడ
సిగ్గేటొ మనసులో
చెదరగొడుతున్నాది!!రావోయి!!






























0 comments:

Post a Comment