Pages

Subscribe:

Tuesday 25 October 2016

ఓ బంగరు రంగుల చిలకా



చిత్రం :  తోట రాముడు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
ప: ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే

ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

౧. పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ .. నీ కొసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే
నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే
ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

౨. సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే
కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ



0 comments:

Post a Comment