Pages

Subscribe:

Tuesday 2 April 2019

ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ

చిత్రం :  సుఖదుఃఖాలు (1968)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  సుశీల
పల్లవి :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 1 :
కసిరే ఏండలు కాల్చునని.. ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని.. మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది..
ఎరుగని కొయిల ఎగిరింది.. చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 2 :
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం.. వసి వాడని కుసుమ విలాసం
 ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 3 :
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో..
మోసం ద్వేషం లేని సీమలో.. మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

0 comments:

Post a Comment