Pages

Subscribe:

Saturday 22 October 2022

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆండాళ్లు తిరుప్పావు కీర్తనలు


 తెల్లతెలవారె వ్రేపల్లెలో వినరమ్మ చల్ల తరిచే సవ్వడి!

నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిన నిదుర వలదమ్మ! చెలులార!

అల్లన బయళ్ళలో ఆలమందలు మూగె, పల్లెలో ప్రతిబాట పరవశమ్మున నూగె!! తెల్ల!!

కొమ్మ కొమ్మా పిల్లగ్రోవి నాట్యమ్మాడె! కొమ్మలారా! పులుగు గోవింద అని పాడె!! తెల్ల!!

రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!(బిలహరి రాగము – ఆదితాళము)

రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!

నీరాడ మనసున్న వారు, మీరూ – మీరు!

శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన

చేరి, కన్నియలార! కూరిమి చెలులార!!రారమ్మ!!

ఇది మార్గశిరము, వెన్నెలవేళ, భాసురము!

ఇది పరవాద్యవ్రతారంభ వాసరము!

మదిలోన జగమెల్ల ముదమంది పొగడ,

కదిసి కంకణ కటక కింకిణులు కదల!!రారమ్మ!!

మరిమరీ కనికనీ మెరసేటి కనులతో

మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ,

కరిమొయిలు మెయిహొయలు గల అందగాడు,

వరదుడౌ మన ఱేడు వ్రతమేలువాడు!!రారమ్మ!!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి

వరలేటి మేటినందుని నందనుండు

అరుణశశింబనిభ శుభవదనుడు

సరసిజాక్షుడె నోము కరుణింపగా!!రారమ్మ!!

 

0 comments:

Post a Comment