Pages

Subscribe:

Sunday 26 January 2014

భారతదేశం మన జన్మప్రదేశం

భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం

౧. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం

౨. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్న గర్భ పేరుగన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం

౩. కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం

0 comments:

Post a Comment