చిత్రం: వాన
రచన: సిరివెన్నెల
గానం: కార్తీక్
ప: ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు
౧. నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధం అల్లుకుందే జన్మ ఖైదులా!!
౨. నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా!!
0 comments:
Post a Comment