చిత్రం: ధనమా? దైవమా?
సాహిత్యం: సినారె
సంగీతం: టి వి రాజు
గానం: పి సుశీల
ప: నీమది చల్లగా స్వామీ నిదురపో దేవుని నీడలో
వేదన మరచిపో నీ మది చల్లగా
౧. ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు
ఆత్మశాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమౌను
మనసు తనది కానిదే!!
౨. జానకి సహనము, రాముని సుగుణము
ఏ యుగమైననూ ఇలకే ఆదర్శము
వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము!!
0 comments:
Post a Comment