Pages

Subscribe:

Friday 14 November 2014

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని

            


చిత్రం: గులేబకావళి కథ
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ప: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

౧. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు!!

౨. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...!!

0 comments:

Post a Comment