Pages

Subscribe:

Tuesday 2 December 2014

సంప్రదాయ పెళ్ళి పాటలు

       
పెండ్లి కొడుకట బహు పెంకి వాడట మన పెళ్ళికూతుర్ని వీనికెందుకు పెళ్ళి చేస్తిమి
కోమలాంగిరో బహు కోపధారట మన కోమలాంగికి కోపధారిని కోరి తెస్తిమి!!పెండ్లి!!
చదువు రాదట సఖియ సంధ్య లేదట చదువులేని వానికి మనము సఖియని ఇస్తిమి!!పెండ్లి!!

మందయానరో ఈ మందగానికి పొందు మీరగ మందగమనను ఎరక్క చేస్తిమి!!పెండ్లి!!    
ఆహాహా ఈ పెండ్లి కొడుకుని ఎన్నాళ్ళుగ వెదికేరమ్మా 2
ఎన్నాళ్ళూ వెదికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా 2సార్లు
చూపులకు సుందరుడమ్మా చూడా నల్లని వాడమ్మా
ఎంత సొంపైన వాడమ్మా ఎంత సొంపైన వాడమ్మా
ఎంత సొంపైన వాడమ్మా ఎంత సొంపైన వాడమ్మా!! ఆహాహా!!
దండిగా ధర్మామూ లేదు కండా పుష్టీ కలవాడే
కండ పుష్టీ కలవాడే కండాపుష్టీ కలవాడే!!
స్నాన సంధ్యా జపమూ తపమూ ఏమీ ఎరుగని వాడమ్మా 2సార్లు
ఏమీ ఎరుగని వాడమ్మా ఎంతా చక్కని వాడమ్మా 2సార్లు !!ఆహాహా!! 
--------
చింకి పాతల్లు కట్టేటి బావకు
పట్టు పీతాంబరమ్ము లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కుండా మూకుళ్లలో బోజనాలొనర్చు బావకు
వెండి కంచము గిన్నె లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కుక్కి మంచంమీద పరుండు బావకు
పట్టి మంచమే పరుపు లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కాలినడకల పోవు బావ గారికి నేడు
మోటారు కారులు అమరేనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
చీటికీ మాటికీ చిరుబుర్రులాడేటి బావకు
సుందరమ్మైన సొగసు వచ్చెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
అల్లరి చేసేటి కొంటె బావకు నేడు
ముక్కుకు ముకుతాడు వేసేమూ
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే

0 comments:

Post a Comment