Pages

Subscribe:

Tuesday 2 December 2014

వదినెకు ఒగసరి బిందెకు బిగుసరి


వదినెకు ఒకసరి - బిందెకు బిగుసరి
బంగారుజడకుచ్చుల మా వదినె
అహ బంగారుజడకుచ్చుల మా వదినె ||వదినెకు||

గాలికి ఎగిరే దుమ్మును జూసి
పౌడరు అంటది మా వదినె
నా ముఖానికంటది మా వదినె ||వదినెకు||

సెరువులొ ఉన్న కప్పలజూసి
బోండాలు అంటది మా వదినె - నేను
బోంచేత్తానంటది మా వదినె ||వదినెకు||

తోపులొ ఉండే తాచును జూసి
వొడ్డాణమంటది మా వదినె - నా
నడుముకు పెట్టమంది మా వదినె ||వదినెకు||

గోడమీద పాకే నల్లులజూసి
బుడ్డొడ్ల బియ్యమనె మా వదినె - నాకు
బువ్వజేసి పెట్టమనె మా వదినె ||వదినెకు||

బండిని నడిపే గాసగాన్నిజూసి
నా మగడన్నది మా వదినె - అహ
బండిలోకి ఎక్కెను మా వదినె ||వదినెకు||

0 comments:

Post a Comment