Pages

Subscribe:

Sunday 1 November 2015

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ

 
ప: సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖాన మనలేని వికాసమెందుకని,
సుమాల బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం !
తెలుసుకోండి ఆతల్లి తపనలో నేటి కన్నీటి కధనం !!
త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణస్వప్నమని !
విషాద వర్షంలో తను వివర్ణచిత్రమని !!

౧. ఆకసాన తననెగరెసి - ఏకాకిగా తననొదిలేసి
పాతాళంలో నిలచిన పౌరుల కరతాళ ధ్వని చూసి
విలవిలలాడుతు వెలవెలబొయెను మువ్వన్నెల జెండా
జలజల కురిసెను తెగిపడిపోయిన ఆశల పువ్వుల దండ !!
త్రిశంకు స్వర్గం లో  విషాద వర్షంలో

౨. ఆవేశంలో ప్రతి నిమిషం  ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం!!
త్రిశంకు స్వర్గం లో  విషాద వర్షంలో!!

౩. కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచుశిఖరం 
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందుసంద్రం!
దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం!
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం !
విషము చిందెను జాతి తనువున ఈ వికృత గాయం !!

 సినిమాలో సాహిత్యం :
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖానమనలేని వికాసమెందుకని
నిజాన్ని బలి కోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం

ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం!
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం!!

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖానమనలేని వికాసమెందుకని

కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం !
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం!
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం!
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం !
విషము చిందెను జాతి తనువున ఈ వికృత గాయం !!

0 comments:

Post a Comment