Pages

Subscribe:

Sunday 1 November 2015

వరు రాయగలరూ

  
ప: ఎవరు రాయగలరూ
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ
అమ్మ అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్గాగ ఆది స్వరం
ప్రాణమనె పాటకి
ఎవరు రాయగలరు
అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మ అను రాగం కన్న తీయని రాగం

౧. అవతారమూర్తి అయినా
అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే
అంతవాడు అవుతాడు
అవతారమూర్తయినా అణువంటె పుడతాడు
అమ్మ పేగు పంచుకునె అంతవాడు అవుతాడు
అమ్మేగా.... అమ్మేగ చిరునామ ఎంతటి ఘన చరితకి
అమ్మేగ కనగలదు అంత గొప్ప అమ్మని

 ౨. శ్రీరామ రక్ష అంటూ నీల్లుపోసి పెంచిందీ
ధీర్ఘాయురస్థు అంటూ నిత్యం దీవించిందీ
శ్రీరామ రక్ష అంటు నీల్లుపోసి పెంచింది
ధీర్ఘాయురస్థు అంటు నిత్యం దీవించింది
నూరేళ్లూ...నూరేళ్లు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతొ
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతొ

0 comments:

Post a Comment