Pages

Subscribe:

Tuesday 8 April 2014

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా

            
ప: రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

౧. అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమితకరుణను నోచనా
కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా!!

౨. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరముచేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్ప జీవులే ఈ మహిమ లన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మచ్చరమ్ములు రేపగా
మద మచ్చరమ్ములు రేపగా!!


0 comments:

Post a Comment