Pages

Subscribe:

Tuesday 8 April 2014

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది

                  
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛ మారవేసుకుంటుంది
ఎందుకో... ఎందుకో ప్రతిపులుగు
ఏదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు
కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్లు ఊగి ఊగి పోతుంది
అదుగో రామయ్యే
ఆ అడుగులు నా తండ్రివే
ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమె నా కోసమె నడచి నడచి నడచీ
నా కన్నా నిరుపేద
నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు
తీరా దయచేసిన
నీ రూపు తోచదయ్యయ్యో
ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ?
నీల మేఘమోహనము నీ మంగళరూపము
కొలను నడిగీ తేటనీరు
కొమ్మనడిగీ పూలచేరు
చెట్టునడిగి పట్టునడిగీ
పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనె రసాలు
దోరవేవో కాయలేవో
ఆరముగ్గిన వేవోగాని
ముందుగా రవ్వంత చూసి
విందుగా అందియ్యనా... (2)


0 comments:

Post a Comment