Pages

Subscribe:

Tuesday 8 April 2014

సీతారాముల కళ్యాణము చూతము రారండి

 
ప: సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చూచువారలకు చూడముచ్చటట
పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట ||2||
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట... ||2||
సురలును మునులును చూడవచ్చునట
కళ్యాణము చూతము రారండి ||శ్రీ సీతారాముల||

౧. సిరి కళ్యాణపు బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి
పెళ్లి కూతురై వెలిసిన సీతా ||కళ్యాణము||

౨. సంపంగి నూనెను కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కను బెట్టి ||2||
పెండ్లికొడుకై వెలసిన రాముని ||కళ్యాణము||

౩. జానకి దోసిట కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ||2||
శిరముల మెరిసిన సీతారాముల ||కళ్యాణము||

0 comments:

Post a Comment